Top
Sneha TV

లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల స్థలాల ఎంపిక

లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల స్థలాల ఎంపిక
X

విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఎన్‌జిఆర్‌పురంలో లాటరీ పద్దతి ద్వారా ఇండ్ల స్థలాల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లోని 376 మంది నిరుపేదలను ఎంపిక చేశామని.. జూలై 8న స్థలాల పట్టాలు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య తెలిపారు. సీఎం జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో లాటరీ పద్దతి ద్వారా స్థలాల ఎంపిక ప్రారంభించామని అప్పల నర్సయ్య పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సురేష్‌, ఎమ్మెర్వో అరుణ కుమారి ఎంపీడీవో కిషోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it