Top
Sneha TV

న్యాయం చేయండి...

న్యాయం చేయండి...
X

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తనను ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఏపీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో ఆ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని రమేశ్ కుమార్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆయన పిటిషన్‌ దాఖలు చేసి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిలను ప్రతివాదులుగా చేరుస్తూ ఆయన పిటిషన్‌ వేశారు. ఈరోజు హైకోర్టు విచారణకు స్వీకరించింది

Next Story
Share it