హత్యకు దారితీసిన అక్రమ సంబంధం
X
అక్రమ సంబంధం హత్యకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లా మన్సురాబాద్లో నివాసముండే సైదులు, యాదగిరి స్నేహితులు. యాదగిరి భార్య లింగమ్మతో సైదులు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు సైదుల్ని హెచ్చరించినా లాభం లేకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు యాదగిరి. ఇందుకు గాను మహిపాల్, శివలతో లక్ష రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 14వ తేదీన సైదులుని మైసమ్మ గుట్టలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్తుగా మద్యం తాపించి కత్తులతో పొడిచి చంపారు. హత్య కేసుగా నమోదు చేసుకొన దర్యాప్తు అనంతరం నిందితులు యాదగిరి, మహిపాల్, శివలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపారు.
Next Story