డోనాల్డ్ ట్రంప్... ఎంత పనిచేశాడో...!?

X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బీ వీసాను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించారు. ఇక ఈ ఏడాది డిసెంబర్31 వరకూ హెచ్ 1బీ, హెచ్ 2బీ, జే 1, ఎల్ 1 వీసాల జారీని నిలిపివేశారు. హెచ్ 1బీ రెన్యువల్స్‌కు ఢోకా లేదని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. హెచ్ 1బీ వీసాల జారీ విధానంలో సంస్కరణలకు ట్రంప్ పిలుపు ఇచ్చారు. మెరిట్ ఆధారంగానే హెచ్1బీ వీసాల జారీకి మొగ్గుచూపారు. దీంతో ప్రతిభావంతులకే అమెరికాలో ఎంట్రీ లభించనుంది.
కాగా, అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వలస ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకే ట్రంప్ హెచ్ 1బీ వీసాల జారీలో సంస్కరణలకు మొగ్గుచూపారని వైట్‌హౌస్ పేర్కొంది.
Next Story