భారత్ లో ఆ ప్రాంతాలు మావే...నేపాల్ సంచలన వ్యాఖ్యలు

X
ఇండియాలోని కీలక ప్రాంతాలను తమదేనంటూ నేపాల్ ప్రభుత్వం రూపొందించిన పొలిటికల్ మ్యాప్‌కు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లిపులేఖ్, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలున్నాయి. అయితే ఈ దుశ్చర్యలను భారతదేశం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చింది. నేపాల్ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. నేపాల్ తన వక్రబుద్ధి పోనిచ్చుకోలేదు. తాజాగా బిహార్‌లోని కొంత ప్రాంతాన్ని తమదేనని తెలుపుతూ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. బిహార్ జల వనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడింది.
Next Story