Sneha TV
న్యూస్

ఖమ్మం: చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించడానికే కార్డన్ సెర్చ్: అడిషనల్ డిసి

X

బలహీనులను దౌర్జన్యంగా దోపిడీ చేస్తూ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించడానికే కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అడిషనల్ డిసిపి సురేష్ కుమార్ అన్నారు. శాంతిభద్రతల పరివేక్షణలో భాగంగా ఖమ్మం టూ టౌన్ పరిధిలోని రమణగుట్ట ప్రాంతంలో ఈరోజు ఉదయం కార్ధన్ అండ్ సర్చ నిర్వహించారు. ఖమ్మం పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసిపీ సురేష్ కుమార్ ఆద్వర్యంలో టౌన్ ఏసిపి వెంకట్రావు ,సిసిఎస్ ఏసిపి ఈశ్వరయ్య , సిబ్బంది సుమారు నాలుగు వందల ఇళ్ళలో సోదాలు నిర్వహించి అనూమానిత వ్యక్తుల అధార్ కార్ధ్, ఓటర్ కార్డులను ఇతర గుర్తింపు కార్డలను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. కాలనీ వాసులు పూర్తిస్ధాయిలో సహకారంతో ప్రతి ఇంటిని క్షుణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసిపి మాట్లాడుతూ .నేరం చేస్తే శిక్షల నుంచి తప్పించుకోలేమనే భయం నేరస్ధుల్లో కలిగినప్పుడు నేరాలు అదుపులో వుంటాయని అన్నారు. చిన్న నేరాలను అరికట్టగలిగితే పెద్ద నేరాలకు ఆస్కారం ఉండదని తద్వారా స్వేచ్ఛ యుతమైన సమాజాన్ని అందించేందుకు దోహదపడుతుందన్నారు. మీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అద్దెకు తీసుకుని ఉన్నప్పటికీ మనకెందుకులే అనే భావన సామాన్యంగా కలుగుతుందని, కాని అదే వ్యక్తి ఒక నేరస్తుడైతే ఆ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో వుహించాలని సూచించారు. సులభంగా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ పక్కవారిని ఆకర్షించి మీపిల్లలను, యువతను తప్పుదోవ పట్టిస్తాయనే విషయాన్ని స్ధానికులు గ్రహించాలని అన్నారు. ప్రతి పౌరుడు యూనిఫారం లేని పోలీసులేనని గుర్తుంచుకోవాలని అన్నారు.
అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజలు నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారని, పేద, మద్యతరగతి ప్రజలు అమాయకత్వం ఆర్థిక నేరగాళ్ల పాలిట వరంగా మారిందన్నారు. ఈజీ మనీకి ఆశ పడడం, మోసపూరిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ (గొలుసుకట్టు వ్యాపారం)లలో మొహమాటానికి పోయి తెలిసిన వారిని చేర్పించడం తద్వారా సన్నిహితులతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. నేరగాళ్ళు ఎప్పటికప్పుడు సరికొత్త స్కీమ్ ల పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనల చేస్తారని, వారు డబ్బుతో ఉడాయించిన తర్వాతనే మోసాలు బయటకి వస్తుంటాయని తెలిపారు. చీట్స్ , స్కీమ్ లను నమ్మి మీ కష్టార్జితాన్ని కోల్పోవద్దన్నారు. మద్యం కోసం ఖర్చు చేసే డబ్బు మీ పిల్లల చదువులకు, భవితరాల భవిష్యత్ కు ఖర్చు చేసి బాసటగా నిలవలన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని, నగరంలో ,తండాల్లో, మీ గ్రామంలోకి, కాలనీలలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే డయల్ 100కు గాని స్ధానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ తనిఖీలలో సరైన ధృవీకరణ పత్రాలులేని 13 ద్విచక్ర వాహనాలను, మూడు ఆటోలను సీజ్ చేసి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించామని అన్నారు . సరియైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లావచ్చని తెలిపారు. కార్డన్ అండ్ సర్చ్ లో సిఐలు రమేష్ , రాజిరెడ్డి, కరుణకర్, రాజు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story
Share it