Top
Sneha TV

యువతిని మోసం చేసిన కేసులో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు ...

X

హైదరాబాద్: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఓయూ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. కిరణ్‌కుమార్‌ను పోలీసులు సోమవారం అర్ధరాత్రి భద్రాచలంలో అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తన దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని, తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని సదరు యువతి గత నెల 19న ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నారు. చెన్నై, బెంగుళూరు, చిత్తూరు, భద్రాచలం తదితర ప్రదేశాలు తిరుగుతూ చివరికి భద్రాచలంలో ఒక లాడ్జిలో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని నగరానికి తీసుకువచ్చి, న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

Next Story
Share it