ఉద్యోగార్థులకు సరికొత్త సవాళ్లు!
ఉద్యోగార్థులకు సరికొత్త సవాళ్లు! శాస్త్ర సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణల ఫలితంగా పరిశ్రమల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. వాటిలో ఉద్యోగాలదీ ఇదే తీరు! ఇరవయ్యో శతాబ్దం డిజిటల్ యుగమైతే... ప్రస్తుతాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవ దశగా పరిగణిస్తున్నారు. ఇది తీసుకువచ్చే Xనుమార్పులనూ, ఉద్యోగావకాశాలనూ గ్రహించి, అత్యాధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవటం భావి ఇంజినీర్ల కర్తవ్యం! ప్రస్తుతమున్న ఉద్యోగాలు 47 శాతం ఆటోమేషన్కి గురవుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. మార్పు అనివార్యం. 'ఆటలో అందరికంటే బాగా ఆడాలంటే ముందుగా ఆట నియమాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి' అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టెయిన్. సరికొత్త సవాళ్లను అవగతం చేసుకుని ముందుకు సాగితేనే సాంకేతిక విద్యార్థుల మనుగడ సాధ్యం. అందుకే ఇండస్ట్రీ 4.0 (నాలుగో పారిశ్రామిక విప్లవం)కు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి. మెషినరీ, ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, డేటా ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఆటోమోటివ్, రబ్బర్, ప్లాస్టిక్ పరిశ్రమలు, ఫర్నిచర్, పేపర్ ఇండస్ట్రీ, గ్లాస్, సెరామిక్స్, స్టోన్స్, బిల్డింగ్ మెటీరియల్స్, టెక్స్టైల్, ఫార్మా, కెమికల్ మొదలైన పరిశ్రమలన్నీ నాలుగో పారిశ్రామిక విప్లవం వల్ల ప్రభావితమవుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిణామాలకు మూల స్తంభాలుగా తొమ్మిదింటిని చెప్పవచ్చు: 1. బిగ్ డేటా 2.
అటానమస్ రోబోట్స్ 3. సిమ్యులేషన్ 4. యూనివర్సల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ 5. ఇండస్ట్రియల్ ఐఓటీ 6.
సైబర్ సెక్యూరిటీ 7. క్లౌడ్ కంప్యూటింగ్ 8. 3డీ ప్రింటింగ్ 9. ఆగ్మెంటెడ్ రియాలిటీ.
ఫలితంగా వచ్చే విప్లవాత్మక మార్పుల్లో ఆటోమేటెడ్ ప్రొడక్షన్, ప్రిడెక్టివ్ మెయిన్టెనెన్స్, కనెక్టెడ్ మెషిన్స్, 3డీ ప్రింటింగ్, స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, నెట్వర్క్డ్ సప్లై చైన్ మొదలైనవి ఉన్నాయి. వస్తువుల నాణ్యత పెంచి, ప్రపంచ వినియోగదారుల అవసరాలను తీర్చగలగడం ఇండస్ట్రీ 4.0 విశిష్ట ఉపయోగాల్లో ఒకటి. ఇంకా.. వేతన భారం తగ్గడం, ఉత్పాదకత పెంపు, వస్తూత్పత్తి సామర్థ్యం పెంపుదల, నెట్వర్క్ ద్వారా పరిశ్రమల కార్యకలాపాలను ఎక్కడినుంచైనా నియంత్రించడం మొదలైన ప్రయోజనాలూ ఉన్నాయి.
నేర్చుకోవటం నిరంతర ప్రక్రియ నాలుగో పారిశ్రామిక విప్లవ ఆధారంగా వెలువడుతున్న వినూత్న, సృజనాత్మక సాంకేతిక ఆవిష్కరణల ఫలితంగా భావి ఇంజినీర్లు తమ పరిజ్ఞాన పరిధిని పెంచుకోవటం తప్పనిసరి. 1 సృజనాత్మక ఆవిష్కరణలకు వివిధ ఇంజినీరింగ్ బ్రాంచిల మధ్య పరస్పర సహకారం అవసరం. తాము చదువుకున్న ఒకే ఒక్క ఇంజినీరింగ్ బ్రాంచి నైపుణ్యం సరిపోదని విద్యార్థులు గుర్తించాలి. 2 వివిధ ఇంజినీరింగ్ బ్రాంచిల మధ్య పరస్పర సహకారం ద్వారా తాము నేర్చుకోవాల్సిన విషయ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవడం చాలా అవసరం.
దీని ద్వారా క్లిష్టమైన, సామాజిక, సాంకేతిక వ్యవస్థల అభివృధ్ధికి ఆస్కారం ఉంటుంది. 3 జీవితకాలం పాటు నేర్చుకునే సామర్థ్యాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలి. 4 తాము ఎదుర్కొనే భిన్న పరిసరాలకు అనుగుణంగా త్వరితగతిన మారగలమనీ, అనుకూల పరిస్థితులను కల్పించుకోగలమనీ భావి ఇంజినీర్లు నిరూపించుకోవాలి. * 18వ శతాబ్దం (1784) ఇండస్ట్రీ 1.0 * మరమగ్గాలు* నీరు, ఆవిరితో *19వ శతాబ్దం (1870) ఇండస్ట్రీ 2.0 * ఎలక్ట్రికల్ శక్తితో నడిచే యంత్రాలు * పెద్దఎత్తున వస్తూత్పత్తి* పరిశ్రమల్లో తయారైన విడిభాగాలను నడిచే వ్యవస్థలు అనుసంధానం చేసి ఒక కృత్రిమ మెదడు ఒక్కటిగా చేర్చడం (అసెంబుల్ టైం) *20వ శతాబ్దం (1969) ఇండస్ట్రీ 3.0 * డిజిటల్ యుగం * ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ల సహాయంతో * ఆటోమేషన్ * ప్రస్తుతం ఇండస్ట్రీ 4.0 *సైబర్, భౌతిక వ్యవస్థలు * వస్తువులను సమాచార వ్యవస్థల ద్వారా నడిచే యంత్రాలు లాంటి వ్యవస్థను నిర్మించడం *మెకానికల్ *మొదటి పారిశ్రామిక విప్లవం *ఎలక్ట్రికల్ *రెండో పారిశ్రామిక విప్లవం *ఎలక్ట్రానిక్స్ అండ్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, * మూడో పారిశ్రామిక విప్లవం *కంప్యూటర్స్ ఐఓటీ నెట్వర్క్స్ * నాలుగో పారిశ్రామిక విప్లవం 33 శాతం కంపెనీల్లో డిజిటైజేషన్ ముప్ఫైమూడు శాతం కంపెనీల్లో ఇప్పటికే అడ్వాన్స్డ్ స్థాయి డిజిటైజేషన్ జరిగింది.
2020కి అది 72 శాతానికి చేరుకుంటుంది. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో డేటా అనలిటిక్స్ ప్రాధాన్యాన్ని 2017 నాటికి 50 శాతం కంపెనీలు గుర్తించాయి. ఇది 2020 నాటికి 83 శాతానికి పెరుగుతుంది. - వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ ఇండస్ట్రీ 4.0 సర్వే * ముఖ్యమైన మూడు రకాలు మారుతున్న పరిస్థితుల్లో సాంకేతిక విద్యార్థులు మూడు రకాల నైపుణ్యాలను సాధించటానికి కృషి చేయాల్సివుంటుంది.
ఎ) పరిశ్రమల వ్యవస్థాపకతా నైపుణ్యాలు * అనిశ్చిత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తిసామర్థ్యాలు * నష్టం సంభవించినప్పుడు ఉండాల్సిన ఓర్పు * సృజనాత్మకత * మార్పులకు అనుగుణంగా నేర్చుకునే ధోరణి * పట్టు విడవని నిరంతర కార్యశూరత్వం బి) సాంకేతిక నైపుణ్యాలు * విస్తృతమైన విషయపరిజ్ఞానం * వివిధ సాంకేతిక అంశాల పై వేగంగా పట్టు సాధించడం * పరిసరాలకు అనుగుణంగా కావాల్సిన పరిశీలనాశక్తి * లభ్యమైన సమాచారం మేరకు తనకు తాను వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడం * మనిషి, యంత్రానికి కావాల్సిన అనుసంధాన పరిజ్ఞానం కలిగి ఉండటం * వివిధ నమూనాల కల్పనా సామర్థ్యం సి) యాజమాన్య నైపుణ్యాలు * నిర్ణయం తీసుకునే శక్తిసామర్థ్యాలు * వేగంగా, కచ్చితత్వంతో కూడిన, డేటా ఆధారిత ప్రణాళికలను రూపొందించడం * నాయకత్వ లక్షణాలు * మార్కెటింగ్, ఆర్థికపరమైన లావాదేవీలపై పట్టు * ప్రపంచస్థాయిలో పరస్పర సమాచార మార్పిడి కోసం కావాల్సిన సహకార నైపుణ్యాలు భిన్నమైన ఆలోచనలు ఉన్నవారే నూతన సవాళ్ళను అందుకుని, నిలదొక్కుకోగలుగుతారు. భావవ్యక్తీకరణ మాత్రమే కాకుండా భావోద్వేగాలను నియంత్రించుకోగల విచక్షణ కూడా అవసరమే. అత్యాధునిక నైపుణ్యాల్లో స్వీయ ప్రతిభ చూపటంతో పాటు ఇతరులకు శిక్షణ ఇవ్వగల, వారి నైపుణ్యాలను మెరుగుపరచగల సామర్థ్యం కూడా పెంచుకోగలగాలి.