నీలోఫర్‌కు 569 పోస్టులు మంజూరు
X
నీలోఫర్ ఆస్పత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 569 పోస్టులు మంజూరు చేసింది. 500 పడకల ఇంటెన్సివ్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అనుమతి నేపథ్యంలో అదనపు పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఉన్నాయి. మంజూరైన పోస్టుల్లో అత్యధికంగా 281 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి.
అలాగే పశుసంవర్థకశాఖలో 52 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇటీవలే విద్యుత్‌శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 13357 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖలోనూ ఖాళీలని పూర్తి చేసేందుకు రెడీ అయ్యింది. మొత్తానికి. నిరుద్యోగులకి శుభ సూచనలు కనిపిస్తున్నాయి.
Next Story