తెలంగాణ విద్యుత్‌శాఖలో భారీగా కొలువుల ప్రకటన.
X
తెలంగాణ రాష్టం వచ్చాక భారీ గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది తెరాస ప్రభుత్వం..ఇప్పటికే అన్ని శాఖల్లో భారీ కొలువులు ప్రకటించిన సంగతి తెల్సిందే..తాజాగా విద్యుత్‌శాఖలో భారీ నియామకాల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. విద్యుత్‌శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 13357 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలిపారు.
మొత్తం 13357 పోస్టుల్లో 3441పోస్టులు ట్రాన్స్‌కోలో, 4329 టీఎస్ జెన్కోలో, 2336 టీఎస్ఎస్పీడీసీఎల్లో, 3251పోస్టులు టీఎస్ఎన్పీడీసీఎల్లో భర్తీ చేయనున్నారు.అన్ని రకాల అనుమతులు వచ్చినందున ఇక నోటిఫికేషన్ జారీ చేయడమే మిగిలింది. ప్రస్తుతం విద్యుత్‌శాఖ అధికారులు నోటిఫికేషన్ రూపొందించే పనిని పూర్తిచేసినట్లు సమాచారం.
Next Story