ఇండియన్ రైల్వేలో జాబ్స్..
ఇండియన్ రైల్వేకు చెందిన సెంట్రల్ రైల్‌సైడ్ వేర్‌హౌస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటికి విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లాజిస్టిక్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్, ఐటీ, అడ్మిన్ విభాగాల్లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తారు. వాటికీ సంబదించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
ఎగ్జిక్యూటివ్: 14
విభాగాలు: లాజిస్టిక్స్/ఆపరేషన్స్/మార్కెటింగ్, 08, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -1, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ -01, సివిల్-02, ఎలక్ట్రికల్-01, హెచ్ఆర్-01.
విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీఈ/బీటెక్ ఉండాలి. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్/ ఆపరేషన్స్ మేనేజ్మెంట్/ మార్కెటింగ్ మేనేజ్మెంట్/ హ్యూమన్ రిసోర్స్ / ఫైనాన్స్ మేనేజ్మెంట్లో ఎంబీఏ/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు : 2017 జనవరి 1 నాటికి 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్య్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 8
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: మే 1