ఇండియన్ నేవీ లో కొలువులు..
ది ఇండియన్ నేవీ (ఐఎన్) లో మరోసారి కొలువుల జాతర మొదలైయింది. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అర్మామెంట్ ఇన్స్పెక్షన్ కేడర్ విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే..
విభాగాలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కెమికల్/ మెటలర్జీ/ ఏరోస్పేస్
విద్యార్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్/ ఇన్స్ట్రుమెంటేషన్/ కెమికల్/ మెటలర్జీ/ ఏరోస్పేస్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2017 ఏప్రిల్ 30 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
శారీరక ప్రమాణాలు: పురుషుల కనీస ఎత్తు 157 సెం.మీ, చాతీ 80 నుంచి 85 సెం.మీ ఉండాలి. మహిళల ఎత్తు 152 సెం.మీ. ఉండాలి.
దరఖాస్తు విధానం: ఇండియన్ నేవీ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ విధానం: విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కోయంబత్తూరు కేంద్రాల్లో ఇంటర్వ్యూలను అయిదు రోజుల పాటు రెండు దశల్లో నిర్వహిస్తారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 07.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్ 27
సర్వీస్ సెలక్షన్ ఇంటర్వూ తేదీ: జూన్-ఆగస్టు 2017
హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు
18 March 2021 11:03 AM GMTఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలో రెండు రోజుల క్రితం మిస్సైన నవ వధువు...
5 Feb 2021 10:04 AM GMTహత్యకు దారితీసిన అక్రమ సంబంధం
23 Jun 2020 12:00 AM GMTబైక్ ను ఢీకొన్న జీపు.. వ్యక్తి మృతి
17 April 2019 12:00 AM GMTక్షణికావేశంలో స్నేహితున్ని హతమార్చిన యువకుడు
1 Jan 2019 12:00 AM GMT