బైక్ ను ఢీకొన్న జీపు.. వ్యక్తి మృతి
X
తిరుపతి : తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు 34 వ మలుపు వద్ద వెళుతున్న బైక్ ను, వేగంగా వచ్చిన జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు బలరాం గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story