Top
Sneha TV

ఇండియా నుంచి ఎంతమంది నీరవ్ మోదీలు పారిపోయారో తెలిస్తే...!

X

న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాల ఆరోపణలతో భారత్ నుంచి పారిపోయిన ఇద్దరి ముగ్గురు పేర్లు మాత్రమే దేశప్రజలకు తెలుసు. కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈసీ) చెప్పిన అసలు లెక్క తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా పలు కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న మొత్తం 36 మంది వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోయినట్టు ఈడీ వెల్లడించింది.

అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసు విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన సుషేన్ మోహన్ గుప్తా బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ ముందు వాదనలు వినిపిస్తూ ఈడీ ఈ వివరాలు వెల్లడించింది. సుషేన్‌కు బెయిల్ ఇవ్వొద్దనీ.. అతడిలా ఆర్ధిక నేరాలకు పాల్పడిన 36 మంది వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోయారని నివేదించింది. సమాజంలో తనకు మంచి పలుకుబడి ఉందంటూ సుషేన్ బెయిల్ కోరడాన్ని కూడా ఈడీ తిప్పికొట్టింది. ఇటీవల దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీలాంటి వాళ్లు కూడా సమాజంలో మంచి పలుకుబడి ఉన్నవాళ్లేనని పేర్కొంది.

Next Story
Share it