Top
Sneha TV

పరిషత్‌ ఎన్నికలకు ఈ 20లోపు నోటిఫికేషన్‌

X

హైదరాబాద్‌: తెలంగాణలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ నెల 18 నుంచి 20వ తేదీలోపు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి, జిల్లాస్థాయి సమీక్షల అనంతరం నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. సోమవారం నాడు ఎన్‌ఈసి కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌కే జోషి, డిజిపి మహేందర్‌రెడ్డితో పాటు వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 18 నుంచి 20 వతేదీలోగా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిధ్దంగా ఉన్నామని తెలిపారు. అన్ని పరిషత్‌ ప్రాదేశిక వర్గాల్లో ఓటరు జాబితాను విడుదల చేసినట్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కూడా అందజేసినట్లు వివరించారు. నోటిఫికేషన్‌ జారీ అయ్యేవరకు ఓటునమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు.

Next Story
Share it