లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు
X
మేడ్చల్ : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ప్రధానోపాధ్యాయుడు వెంకటరాంరెడ్డి తమపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ అయిదుగురు విద్యార్థినులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. లిఖిత పూర్వకంగా ఆయన పై ఫిర్యాదు చేశారు. చదువు పేరుతో తిట్టడం, కొట్టడంతో పాటు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ అయిదుగురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో, బాలల హక్కుల సంఘం నేతలు షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ.. కొంత మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు తనపై కక్ష కట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.
Next Story