Top
Sneha TV

టికెట్ పై మోదీ ఫొటో..ఇద్దరు అధికారులు సస్పెండ్

X

యూపీ: రైల్వే ప్రయాణికులకు ప్రధాని మోదీ ఫొటో ముద్రించబడి ఉన్న టికెట్లను జారీచేసిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. బరబాంకి రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికుల వద్దున్న టికెట్లను గుర్తించాం. ఏప్రిల్‌ 13న షిప్ట్‌ మారిన సమయంలో..పొరపాటున ఉద్యోగులు పాత టికెట్లు ఇచ్చారు. ఎన్నికల కోడ్ ను పట్టించుకోకుండా టికెట్లు జారీచేసిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని ఏడీఎం తెలిపారు. అధికారులపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

Next Story
Share it