Top
Sneha TV

వారసుల గెలుపు కోసం అగ్రనేతల ఆరాటం

X

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీల అగ్రనేతలు వా రసులకోసం తంటాలు పడుతున్నారు. జేడీఎస్‌ ముఖ్యనేత, సీఎం కుమారస్వామి వారసుడు నిఖిల్‌ మండ్య నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర మరోసారి శివమొగ్గ నుంచి బరిలోకి దిగారు. ఇరు పార్టీల అగ్రనేతల వారసులు పోటీలో ఉండడంతో వారి గెలుపునకు అ హర్నిశలు రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఏమాత్రం అటూ ఇటైనా వారిరువురి భవిష్యత్తుకే ముప్పు తప్పదనిపిస్తోంది. శివమొగ్గలో ఎన్నికల ముందునుంచే ప్రణాళికాబద్ధం గా యడ్యూరప్ప ప్రచారాలు చేస్తున్నారు.

అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోదీ సహా ముఖ్యులు కర్ణాటక పర్యటనకు వస్తే వారి వెంట ఉంటూనే ఏమాత్రం నాలుగైదు గంటలు సమయం ఉన్నా శివమొగ్గకు వెళ్ళిపోతున్నా రు. నియోజకవర్గంలోని అన్ని శాసనసభ స్థానాల పరిధిలోనూ ఆ యన ప్రచారాలు చేస్తున్నారు. రెండోవిడత పోలింగ్‌ సాగనుండడంతో మరో 9రోజులు గడువు ఉంది. తొలి విడత ప్రచారాలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇటువైపే గడిపి ఆ వెంటనే శివమొగ్గకు చేరుకుని మూడు రోజులు నియోజకవర్గంతోపా టు ఉత్తర కర్ణాటకకే పరిమితం కావాలని నిర్ణయించారు. ఇటీవల లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీవై రాఘవేంద్ర గెలుపొందారు. ఇదే స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధుబంగారప్ప జేడీఎస్‌ నుంచి బరిలో ఉన్నారు. వరుసగా ఓటమిపాలవుతున్న మధు బంగారప్పకు సానుభూతి కలిసొచ్చే అవకాశం ఉంది.

ఇక మండ్య నుంచి సీఎం కుమారస్వామి వారసుడు నిఖిల్‌ జేడీఎ్‌స-కాంగ్రెస్‌ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి లేకున్నా స్వతంత్రంగా బరిలోకి దిగిన సుమలతను ఢీ కొనడం అంత సులువే మీ కాదనిపిస్తోంది. దేవేగౌడతోపాటు ఇరువురు మనవళ్లను పోటీకి దించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిచోటా వ్యతిరేకత కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సీఎం కుమారస్వామి దా దాపు మండ్యకే పరిమితమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉత్తర కర్ణాటకలో ఉమ్మడి అభ్యర్థుల తరపున ప్రచారాలు చేసిన దాఖలాలు లేవు. మండ్య, హాసన్‌, తుమకూరులకే పరిమితమయ్యారు. మండ్య పరిధిలోని కెఆర్‌ఎస్‌ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉం డే హోటల్‌లో బస చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రెబల్స్‌గా మారడంతో వారిని బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా రు.

అయినా ఇక్కడి పరిస్థితి భిన్నంగా ఉంది. సుమలత తరపున పార్టీలకు అతీతంగా ప్రజ లు ప్రచారాల్లో పాల్గొంటున్నారు. సుమలతను టార్గెట్‌ చేస్తూ జేడీఎస్‌ నేతలు, మంత్రులు, ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా దూ సుకెళ్తున్నారు. ఆమె తరపున స్టార్‌ హీరోలు యశ్‌, దర్శన్‌లు ప్రచారం చేయడంతో మరింత ఆకర్షణ అయ్యింది. ఏది ఏమైనా మండ్యలో పొ ర పాటు జరిగితే కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి కోల్పోయే అవకాశాలు లేకపోలేదు.

Next Story
Share it