Top
Sneha TV

హెలికాప్టర్‌లో రాహుల్‌ పక్కన పీటర్‌ అల్ఫోన్స్‌

X

చెన్నై: తేనిలో జరిగిన ప్రచారసభలో కాం గ్రెస్‌ జాతీయ అధ్య క్షుడు రాహుల్‌గాంధీ ఆంగ్లంలో ప్రసంగించగా, ఆ పార్టీ సీని యర్‌ నేత పీటర్‌ ఆల్ఫోన్స్‌ దానిని తమిళంలో అనువదించిన విషయం తెలిసిందే. గతంలో రాహుల్‌ ప్రసంగాన్ని మరో సీనియర్‌ నేత తంగబాలు చేసిన అనువాదం తప్పులతడకగా వుందని పలువురు విమర్శించారు. కానీ, పీటర్‌ అల్ఫోన్స్‌ చేసిన అనువాదాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రాహుల్‌ కూడా అభినందించారు. సభ ముగిసిన అనంతరం ఆయన చేయి పట్టుకున్న రాహుల్‌ 'తనతో రావాలని' కోరి హెలికాప్టర్‌లో ఆయనను మదురై సభకు తీసుకెళ్లారు. ఆఖరి క్షణంలో ఎఫ్‌బీఐ అనుమతితో రాహుల్‌తో కలసి హెలికాప్టర్‌లో ప్రయాణం చేయడంపై పీటర్‌అల్ఫోన్స్‌ ఆనందంలో మునిగిపోయారు.

Next Story
Share it