Top
Sneha TV

ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే.. మౌనమా : సుష్మా స్వరాజ్‌

X

యుపి : బిజెపి అభ్యర్థి సినీ నటి జయప్రదపై ఆజంఖాన్‌ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ... ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఉత్తరప్రదేశ్‌ లో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోందని, ములాయం సింగ్‌ యాదవ్‌, భీష్ముడి మాదిరిగా మౌనంగా ఉన్నారని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ మండిపడ్డారు. '' ములాయం సింగ్‌ యాదవ్‌ భాయ్‌... మీరు సమాజ్‌ వాదీ పార్టీకి పెద్ద దిక్కు.. మీకు సమీపంలోనే ఉన్న రామ్‌పూర్‌ లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది.. మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పొరపాటు చేయవద్దు '' అని పేర్కొన్నారు. ఆజంఖాన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్‌ చేశారు. జయప్రద అసలు స్వరూపాన్ని తెలుసుకునేందుకు రామ్‌పూర్‌ ప్రజలకు 17 సంవత్సరాలు పట్టిందని, తాను మాత్రం 17 రోజుల్లోనే ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకున్నట్లు గుర్తించానని ఆజంఖాన్‌ వ్యాఖ్యానించడంపై మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది.

Next Story
Share it