Top
Sneha TV

శోభాయమానంగా శ్రీరాముని శోభాయాత్ర పక్కల రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు

X

హైదరాబాద్ : శ్రీరామ నవమి రోజున ఏటా హైదరాబాద్‌లో నిర్వహించి శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ సంఖ్యలో భక్తులు తరిలివచ్చారు. కాషాయ జెండాలతో వీధులన్నీ రెపరెపలాడాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్ర కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్ పేట గంగాబౌలిలో సీతారాముల దర్బార్‌కు పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు.

నేడు పట్టాభిషిక్తుడు కానున్న రామయ్య

1
2010 నుంచి రాజాసింగ్ ఆధ్వర్యంలో

శ్రీరాముని శోభాయాత్రను 2010 నుంచి రాజాసింగ్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర చివరి వరకు ప్రశాంత వాతావరణంలో సాగింది.

2
బ్యాండ్ మేళాలు, డీజేల హోరు

బ్యాండ్ మేళాల చప్పుడు, డీజేల పాటలకు యువత ఆటపాటలతో శోభాయాత్రం ఆద్యంతం అద్భుతంగా సాగింది. సీతారాం బాగ్, గంగాబౌలి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర మంగళ్‌హాట్ ప్రధాన రోడ్డులో కలిశాయి. పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బేగం బజార్, సిద్ధంబర్ బజార్, గౌలిగూడ, కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ టేక్డీ వరకు శోభాయాత్ర సాగింది.

3
భక్తుల రద్దీ.. భారీ బందోబస్తు

తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో శోభాయాత్ర కళకళలాడింది. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో బేగంబజార్, ధూల్‌పేట్, మంగళ్‌హాట్ ప్రాంతాల్లో రోడ్లన్నీ ఇసకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. శోభాయాత్రలో ప్రదర్శించిన దేవతామూర్తుల విగ్రహాలు ఆకట్టుకున్నాయి. శ్రీరాముని విగ్రహం, సీతారాముల పల్లకి సేవ, రాధాకృష్ణులు, రాణి అవంతిబాయి, హనుమాన్‌పై శ్రీరామ్ రామబాణం తదితర విగ్రహాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Next Story
Share it