Top
Sneha TV

అభ్యర్థి విజయం కోసం గుండు గీయించుకున్న కార్యకర్త

X

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించాలని ఆ పార్టీ కార్యకర్త గుండు గీయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పుదుచ్చేరి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ వైద్యలింగం, తట్టాన్‌చావడం అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి వెంకటేశన్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురూ విజయం సాధించాలని, కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టాలని కోరుతూ తట్టాన్‌చావడి కాంగ్రెస్‌ కార్యకర్త శ్రీనివాసన్‌ ఐశ్వర్య వినాయక ఆలయంలో మొక్కు చెల్లించుకునే విధంగా గుండుగీయించుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు గుమ్మికూడి శ్రీనివాసన్‌ను అభినందించారు.

Next Story
Share it