చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారు: డొక్కా
X
గుంటూరు: అత్యధిక సీట్లతో చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చంద్రబాబు పోరాడుతున్నారన్నారు. ఈసీ వైఫల్యంపై విచారణ జరగాలని కోరారు. ఈసీ సరైన ప్రణాళిక లేకుండా ఎన్నికలు నిర్వహించిందని ఆరోపించారు. ఈసీ వైఫల్యంపై చంద్రబాబు దేశం మొత్తాన్ని అలెర్ట్ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సంస్కరణకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.
Next Story