Top
Sneha TV

కనిమొళికి మద్దతుగా 16 గ్రామాల ప్రజల ప్రచారం

X

చెన్నై: సహాయాలనందించిన డీఎంకే అభ్యర్థి కనిమొళి గెలుపుకోసం డెల్టా ప్రాంత ప్రజలు తూత్తుకుడిలో ముమ్మర ప్రచారాలు చేపట్టారు. గత యేడాది నవంబరు మాసంలో 'గజ' తుపాను ప్రభావంతో డెల్టా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రకృతి వైపరీత్యం కారణంగా డెల్టా ప్రజలు జీవనోపాధి కోసం ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ డెల్టా జిల్లాలో పేరావూరణి ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న విషయం తెలిసి ఎంపీ కనిమొళి ముందుకు వచ్చి సహాయాలను అందించారు.

డీఎంకే కార్యకర్తలే కాకుండా తెలిసిన బంధువులను కూడా సంప్రదించి 16 గ్రామాల్లోని ప్రజల ఆకలి తీర్చారు. ఆకలి బాధ తీర్చిన ఆమె సహాయాన్ని మరిచిపోకుండా పేరావూరణి పరిధిలోని 16 గ్రామాలకు చెందిన ప్రజలు డీఎంకే అభ్యర్థిగా తూత్తుకుడి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కనిమొళికి మద్దతుగా ప్రచారాలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కనిమొళి గ్రామస్తులను నేరుగా కలుసుకుని పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత తప్పక మరెన్నో అభివృద్ధి పథకాలను అమలుపరుస్తానని హామీ ఇచ్చారు.

Next Story
Share it