వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జట్టు వెల్లడి.. స్మిత్, వార్నర్ రీ ఎంట్రీ
ఇంగ్లాండ్ : ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించనున్న ఐసిసి వరల్డ్ కప్ కోసం ఈ రోజు (సోమవారం) ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్ల జాబితాను ఆసీస్ ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో 2018 లో నిషేధానికి గురైన స్మిత్, వార్నర్‌లకు చోటు కల్పించారు. నిషేధం తర్వాత ఇప్పటి వరకు వీరిద్దరూ ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. వారి సామర్థ్యంపై నమ్మకముంచిన ఆసీస్ మేనేజ్మెంట్ మెగా టోర్నీకి వారిని ఎంపిక చేసింది.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టు :
అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్, అలెక్స్ కేరీ, మార్కస్ స్టాయినీస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, జే రిచర్డ్సన్, పాట్ కమిన్స్, బెహ్న్రెండార్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడం జంపా, నాథన్ లైయన్.. ఇలా 15 మంది పేర్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.