Top
Sneha TV

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల హతం

X

రాంచీ: ఝార్ఖండ్‌లోని గిరిదీహ్‌ అడవుల్లో కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు. కాగా.. ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు.

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదీహ్‌ జిల్లా బెల్బాఘాట్‌ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ ఏడో బెటాలియన్‌కు చెందిన జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు నక్సల్స్‌ను హతమార్చారు. ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్‌, 3 బులెట్‌ మ్యాగజైన్లు, 4 పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు.ఘటనాస్థలంలో ముమ్మర గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 29 నుంచి ఝార్ఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Next Story
Share it