Top
Sneha TV

ఆజంఖాన్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కన్నెర్ర

X

న్యూఢిల్లీ : రాంపూర్‌ బీజేపీ అభ్యర్థి, సినీనటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసిన అజాంఖాన్ పై ఎన్నికల కమిషన్ కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ డిమాండు చేశారు. ఈ మేర కేంద్ర ఎన్నికల కమిషన్ కు రేఖాశర్మ లేఖ రాశారు. మహిళను కోరిక తీర్చే వస్తువుగా చిత్రీకరించడం తగదన్నారు. మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి వ్యతిరేకంగా మహిళలు ఓటు వేయాలని రేఖా శర్మ కోరారు. రాంపూర్‌ ఎన్నికల ప్రచారంలో ఆదివారం ఆజాంఖాన్ మాట్లాడుతూ.. ''జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది నేనే. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించలేకపోయా..'' అని పేర్కొన్నారు. ఇలా మహిళపై అజాంఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం రెండో సారని ఆయనపై చర్యలు తీసుకోవాలని రేఖా శర్మ డిమాండ్ చేశారు. జయప్రదపై అజాంఖాన్ చేసిన వ్యాఖ్యల కేసును సూమోటోగా విచారణకు స్వీకరించి నిందితుడికి నోటీసులు జారీ చేస్తానని రేఖాశర్మ వివరించారు.

Next Story
Share it