Top
Sneha TV

శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవం

X

భద్రాద్రి: భద్రాద్రి రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. అశేష భక్తకోటి నామస్మరణ మధ్య శ్రీరామపట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. స్వామివారికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకు ముందు భద్రాద్రి రామయ్యను గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. ప్రధానాలయంలో అర్చకులు పూజలు నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి ఆలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story
Share it