Top
Sneha TV

బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా వివేక్ ఒబెరాయ్

X

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శుక్రవారం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. గుజరాత్‌లో లోక్‌సభ, విధానసభ ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న తమ పార్టీ అభ్యర్థుల తరఫున వీరంతా ప్రచారం నిర్వహించనున్నారని బీజేపీ పేర్కొంది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్‌ను కూడా బీజేపీ తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరకెక్కించిన 'పీఎం నరేంద్రమోదీ' చిత్రంలో వివేక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బొమన్ ఇరానీ, మనోజ్ జోషీ, కిశోర్ షహానే, దర్శన్ కుమార్ ఇతర పాత్రలో కనిపించనున్నారు. ప్రధాని మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్రమోదీ' సినిమాను నిర్మించారు.

Next Story
Share it