Top
Sneha TV

ప్రత్యర్థి జట్టుకు పిచ్‌ బాగా సహకరించింది

X

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధానకోచ్‌ రికీ పాంటింగ్‌ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇదే మైదానంలో ఢిల్లీ ఓటమి పాలైంది. సొంత వేదికపై ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు జట్టు సభ్యులు. ప్రత్యర్థి జట్టుకే పిచ్‌ బాగా సహకరించిందని పాంటింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కఠినమైన పిచ్‌పై పరుగులు చేయడానికి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ తీవ్రంగా శ్రమించింది. పిచ్‌ స్పందించిన తీరు ఎంతగానో ఆశ్చర్యపరచింది.హైదరాబాద్‌ టీంకు పిచ్‌ అద్భుతంగా సహకరించిందని వాపోయారు. సీమర్లందరూ స్లో బంతులు విసిరారు. ఇలాంటి మైదానంపై స్లో బంతులు విసిరితే బ్యాటింగ్‌ చేయడం కష్టంగా ఉంటుందని పాంటింగ్‌ అన్నారు.

Next Story
Share it