Top
Sneha TV

ఈశాన్య ఢిల్లీ టికెట్ ఆశిస్తున్న సినీ నటుడు

X

న్యూడిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఇవాళ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కలుసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై షీలా దీక్షిత్‌ను కలిసినట్లు తెలుస్తోంది. తాను కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ విషయమై షీలా దీక్షిత్‌ను కలుస్తున్నట్లు ఈ సందర్భంగా రాజ్ పాల్ యాదవ్ స్పష్టం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో పోటీ విషయమై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని రాజ్‌పాల్ యాదవ్ కోరారని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. ఆప్ తో కూటమి విషయమై చర్చల కారణంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బీజేపీ తరుపున ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి భోజ్ పురి నటుడు, ఎంపీ అభ్యర్థిగా మనోజ్ తివారీ పోటీలో ఉన్నారు. రాజ్ పాల్ యాదవ్ కు టికెట్ కేటాయిస్తే..ఈ ఎన్నికల్లో ఇద్దరు నటుల మధ్య పోటీ నెలకొననుందన్నమాట.

Next Story
Share it