Top
Sneha TV

కేసీఆరే దేశ ప్రధాని: రంగోళి వేసి అభిమానం చాటుకున్న మహిళ

X

జనగామ: ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశానికి చేసిందేమీ లేదు. వాళ్ల పాలనలో దేశం ఎటువంటి అభివృద్ధి చెందలేదు. అయినా మళ్లీ అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ వీళ్లనే గెలిపించాలా? అందుకే.. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటి మీదికి తీసుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు ఆయన ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తానని, దేశం గతిని మారుస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో కాబోయే ప్రధాని కేసీఆరేనని... ఆయన మీద అభిమానంతో ఓ మహిళ రంగోళి వేశారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెద్ది కుసుమ అనే మహిళ కేసీఆర్ రంగోళి వేసి కేసీఆర్ మీద తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ రంగోళిని చూడటానికి జనగామ ప్రజలు అక్కడికి తరలివస్తున్నారు. ఆసక్తిగా ఉన్న ఆ రంగోళిని చూసి ఆ మహిళను మెచ్చుకుంటున్నారు.

Next Story
Share it