Top
Sneha TV

మోడీని నేను తిట్టినట్టు ఎవరూ తిట్టలా... : బాలయ్య

X

సినిమాల్లోనే కాదు బాలయ్య ఇప్పుడు ప్రచారాల్లో కూడా పంచ్ డైలాగ్స్ తో దుమ్మురేపుతున్నారు. కాకపోతే ఈ సారి కాస్త డోస్ పెంచి బూతులు కూడా తిడుతున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేసుకొని కాలుస్తా..చంపుతా..నరుకుతా..కొంతు కోస్తా..ఓరేయ్..నీ..ఇలా ఒక్క మాట కాదు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉన్నారు. ఓవైపు మీడియాలో..పేపర్లో బాలయ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.

మీటింగ్ కి జనాలు కాస్త ఎక్కువ హాజరైనట్టు భావించిన బాలయ్య ఉన్నట్టుండి పూనకం వచ్చినవాడిలా చెలరేగిపోయారు. మోదీకి సిగ్గూ, శరం లేవని, నిజంగా మగాడే అయితే తాను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చచ్చిపోవాలంటూ సవాల్ విసిరారు. మోదీని నేను తిట్టినట్టు దేశంలో ఎవరూ తిట్టి ఉండరు..అని మరోసారి తన ప్రతాపాన్ని చూపించుకున్నారు.

గతంలో ఓసారి బాలకృష్ణ హిందీ భాషలో సైతం మోదీపై వాగ్బాణాలు సంధించారు. తాజాగా, అదే తీవ్రతతో తిట్ల వర్షం కురిపించారు. మరోవైపు తెలంగాణ సీఎం, వైసీపీ నేత జగన్ లపై కూడా తిట్ల వర్షం కురిపించారు. ఏపిని సర్వ నాశనం చేయడానికి ఇద్దరూ కుమ్మక్కయ్యారని మోదీ, జగన్, కేసీఆర్ ఈ ముగ్గురూ కలిసి వచ్చినా తననేమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it