Top
Sneha TV

అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్‌!

X

విజయనగరం: విజయనగరంలో జనసేన బహిరంగ సభలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. వేదికపై పవన్‌ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా..వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని పవన్‌ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో ఆయన ఒక్కసారిగా తుళ్లిపడి వేదికపై కింద పడిపోయారు. మైక్‌ కూడా విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆయన్ని పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

Next Story
Share it