Top
Sneha TV

తెల్ల కార్డుదారులకు నెలకు రూ.6వేలు: కోమటిరెడ్డి

X

నల్గొండ: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు రూ.6వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కొలనుపాకలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు లేవుగానీ.. కేసీఆర్‌ కుటుంబానికే మాత్రం ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాహుల్‌ నాయకత్వంలోనే దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

Next Story
Share it