Top
Sneha TV

కోహ్లిసేనకు పాకిస్థాన్ ప్రధాని శుభాకాంక్షలు

X

ఇస్లామాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ గెలిచిన కోహ్లి సేన.. ఇప్పటివరకు ఏ ఏషియన్ టీమ్‌కూ సాధ్యం కాని రికార్డును సాధించిన విషయం తెలిసిందే. దీంతో ట్విటర్ వేదికగా ఇమ్రాన్ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా టీమ్‌గా నిలిచిన విరాట్ కోహ్లి, ఇండియన్ క్రికెట్ టీమ్‌కు శుభాకాంక్షలు అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్, మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో కోహ్లిసేన గెలిచిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా సిడ్నీ టెస్ట్ డ్రాగా ముగియడంతో సిరీస్‌ను కోహ్లి సేన 2-1తో గెలిచింది. ఈ చారిత్రక విజయం సాధించిన టీమ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.

Next Story
Share it