Top
Sneha TV

మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన గప్టిల్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో

X

నెల్సన్: న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ ఒంటిచేత్తో పట్టిన ఓ కళ్లు చెదిరే క్యాచ్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. దీంతో శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో కివీస్ 115 పరుగులతో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. నెల్సన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 364 పరుగులు చేసింది. రాస్ టేలర్ (137), హెన్రీ నికోల్స్ (124) సెంచరీలు చేశారు. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 41.4 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌటైంది. రెండో వన్డేలో కివీస్ గుండెల్లో గుబులు పుట్టించిన థిసర పెరీరా ఈ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. 62 బంతుల్లోనే 80 పరుగులు చేసి మరోసారి ప్రమాదకరంగా కనిపించాడు. ఈ సమయంలో అతడు ఇచ్చిన క్యాచ్‌ను మార్టిన్ గప్టిల్ కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. 6 వికెట్లకు 244 పరుగులతో ఉన్న లంక.. పెరీరా ఔటవగానే మరో ఐదు పరుగుల తేడాలో మిగిలిన అన్ని వికెట్లను చేజార్చుకుంది. ఇదీ గప్టిల్ పట్టిన ఆ క్యాచ్ వీడియో.

Next Story
Share it