Top
Sneha TV

అధ్యయనం లేకుండా హడావుడిగా రిజర్వేషన్ల ప్రకటన- ఎంపీ సుజనా

X

పార్లమెంటులో టీడీపీ ఎంపీలను దారుణంగా సస్పెండ్ చేశారన్న ఎంపీ సుజనా చౌదరి సభ నడపడం కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదనిౌ ప్రజాస్వామ్యంలో హక్కులను అడగకూడదా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలలో పేదలకు పదిశాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారో వివరణ ఇవ్వలేదని.. రాజకీయ లబ్దికోసం రిజర్వేషన్ పెంచకూడదన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఆయా రాష్ట్రాలకే ఇవ్వాలని తాము కోరామని.. ఈబీసీ రిజర్వేషన్లను టీడీపీ వ్యతిరేకం కాదని.. ఎలాంటి అధ్యయనం లేకుండా హడావుడిగా రిజర్వేషన్ల ప్రకటన చేశారన్నారు. కేంద్ర నిర్ణయం, రిజర్వేషన్ల కేటాయింపుపై అధ్యయనం చేశాక వెల్లడిస్తామని.. ఈరోజు నిర్ణయం తీసుకొని రేపు సభలో బిల్లు పెట్టి ఎలా ఆమోదించుకుంటారన్నారు.

Next Story
Share it