Top
Sneha TV

'ఏపీకి 35వేల కోట్ల ప్యాకేజీ విడుదల చేయాలి'

X

అమరావతి: కేంద్ర హామీ ప్రకారం ఏపీకి 35వేల కోట్ల ప్యాకేజీ విడుదల చేయాలని, వెనుకబడిన జిల్లాలకు మూడేళ్లలో 1,050 కోట్లే ఇచ్చారని స్వతంత్ర నిపుణులు కమిటీ తెలిపింది. 11 జాతీయ సంస్థలకు కేంద్రం 12,746.38 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 6.63 శాతం మాత్రమే నిధులు ఇచ్చారని కమిటీ పేర్కొంది. రాజధాని తెలంగాణాకు వెళ్లడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, విభజనతో ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో ఏపీ నష్టపోయిందని కమిటీ వెల్లడించింది. విభజన చట్టం నిబంధనల వల్ల పన్నుల చెల్లింపు, బకాయిల్లో నష్టం జరిగిందని, తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీ వెనకబడిందని చెప్పింది.

''కాగ్‌ నివేదిక ప్రకారం ఏపీ ఆర్థిక లోటు రూ. 16,078 కోట్లు. కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 3,979 కోట్లు మాత్రమే. డిస్కమ్‌లకు కేంద్రం ఇంకా రూ.1500 కోట్లు ఇవ్వాలి.

పింఛన్ల చెల్లింపులో కేంద్రం ఇవ్వాల్సిన వాటా రూ. 1985 కోట్లు. రూ. 3,920 కోట్ల పీఆర్సీ బకాయిలను కేంద్రమే చెల్లించాలి.

విభజన చట్టం ప్రకారం 2,725.16 కోట్లు మాత్రమే కేంద్రం చెల్లించింది. తెలంగాణకు రూ. 6,699 కోట్లు కేంద్రం చెల్లించింది. కొన్ని చట్టాల కారణంగా ఏపీకి రూ.

3,820 కోట్లు నష్టం. పోలవరానికి కేంద్రం రూ. 6,727.26 కోట్లు మాత్రమే చెల్లించారు. పోలవరానికి కేంద్రం ఇంకా 3,342.40 కోట్లు చెల్లించాలి. 2019-20లో కేంద్రం నుంచి పోలవరానికి ఇవ్వాల్సిన మొత్తం రూ.

27,474 కోట్లు. హామీ ప్రకారం వెనకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇవ్వాలి'' అని స్వతంత్ర నిపుణులు కమిటీ డిమాండ్ చేసింది.

Next Story
Share it