Top
Sneha TV

ఈ నెల 13 నుంచి స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్

X

హైదరాబాద్ : ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన బ్రోచర్ ను రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ..కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈసారి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. భారత దేశ సంస్కృతిని చాటే విధంగా ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మహిళలు, పలు దేశాలకు చెందిన వారు ఆయా రాష్ట్రాలు, దేశాల స్వీట్స్ ను ఈ ఉత్సవాల్లో ప్రదర్శిస్తారని వెల్లడించారు. అదేవిధంగా పలు దేశాలకు చెందిన పతంగులను ఈ ఉత్సవాల్లో భాగంగా ఎగురవేస్తారని చెప్పారు. గత ఏడాది కైట్, స్వీట్ ఫెస్టివల్ కు 7 లక్షల మంది వచ్చారని, ఈ దఫా కూడా 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it