Top
Sneha TV

క్రాస్ రోడ్స్ బావర్చి హోటల్ సీజ్

X

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో గల బావర్చి హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. హోటల్ యాజమాన్యం పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణను సరిగా చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్‌ను సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-15 ఏఎంహెచ్‌వో డాక్టర్‌ హేమలత నేతృత్వంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థ పదార్థాలను మ్యాన్‌ హోల్‌లోకి వదులుతున్నారని ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆస్టోరియాతో పాటు పలు హోటళ్లకు నోటీసులు జారీ చేసినట్టు ఆమె చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Next Story
Share it