Top
Sneha TV

'అజిత్‌ కామెంట్‌ బలాన్నిచ్చింది'

X

చెన్నై: అగ్ర కథానాయకుడు అజిత్‌ నటించిన చిత్రం 'విశ్వాసం'. నయనతార కథానాయిక. శివ దర్శకత్వం వహించారు. 'వీరమ్‌', 'వేదాలం', 'వివేగం' తర్వాత అజిత్‌-శివ కాంబినేషన్‌లో రూపొందిన నాలుగో చిత్రమిది. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రం చక్కగా వచ్చిందని, సినిమా చూసిన అజిత్‌ ఆనందం వ్యక్తం చేశారని దర్శకుడు శివ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ''విశ్వాసం' నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత అజిత్‌ సర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మనం తీసిన నాలుగు చిత్రాల్లో ఇది ది బెస్ట్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన నలుగురిలో ఉన్నప్పుడు గట్టిగా అరుస్తూ చెప్పారు.. అందుకే ఇప్పుడు మీ (మీడియా) ముందు చెబుతున్నా. ఆయన లాంటి స్టార్‌ నుంచి అలాంటి కామెంట్‌ రావడం దర్శకుడిగా నాకు బలాన్ని ఇచ్చింది' అని అన్నారు.

అజిత్‌తో మరో సినిమా గురించి ప్రస్తావిస్తూ.. 'అజిత్‌ చాలా మంది వ్యక్తి. ఆయనతో కలిసి నాలుగు సినిమాల కోసం పనిచేయడం సంతోషంగా ఉంది. ఒకవేళ ఐదోసారి ఆయన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వస్తే అది నా అదృష్టం అని చెప్పొచ్చు' అని శివ పేర్కొన్నారు.

Next Story
Share it