Top
Sneha TV

4 సంవత్సరాల 8 నెలలు ఏం చేశారు?

X

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని 'ఎన్నికల గిమ్మిక్'గా కాంగ్రెస్ కొట్టిపారేసింది. కోటా నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి విధించినప్పుడు ఆ అంకెలు మార్చే గారడీ ఏవైనా ప్రభుత్వం దగ్గర ఉందా అని ఆయన ప్రశ్నిచారు. నాలుగు సంవత్సరాల 8 నెలల పాటు వేచిచూసి ఇప్పుడే ఇలాంటి చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఇంతకాలం ఏం చేశారని నిలదీశారు. 50 శాతం గరిష్ట కోటా దాటకూడదనే విషయం మీకు తెలియదా అని సింఘ్వి ఓ ట్వీట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించారు.

Next Story
Share it