Top
Sneha TV

ఈనెల 17న అసెంబ్లీ.. 19న కౌన్సిల్ సమావేశం

X

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 17న ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అలాగే ఈనెల 19న ఉదయం 11.30 గంటలకు మండలి సమావేశం ప్రారంభమవుతుంది. ఈనెల 19న ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.

Next Story
Share it