Top
Sneha TV

అంతర్జాతీయ అందాల పోటీలకు.. ఐదేళ్ల చిన్నారి!

X

ఇంటర్నెట్‌ డెస్క్‌ : చదివేది ఒకటో తరగతి. పట్టుమని ఐదేళ్లు కూడా లేవు. అయితేనేం 40 దేశాలకు చెందిన చిన్నారులతో అందాల పోటీలకు సిద్ధమైంది. అంతర్జాతీయ వేదికపై దేశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఏకైక పోటీదారుగా నిలిచింది. బుడిబుడి నడకలు, ముద్దుముద్దు మాటలతోనే సత్తా చాటుతానంటోంది ఈ లిటిల్‌ ప్రిన్సెన్స్‌.

బుజ్జి బుజ్జి మాటలతో ముచ్చటగొలుపుతున్న ఒకటో తరగతి చిన్నారి ప్రపంచ బుజ్జాయిల అందాల పోటీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం సాధించిపెట్టింది. విజయవాడకు చెందిన ఐదేళ్ల చిన్నారి పాటిబండ్ల యామిని ఈనెల 8న యూరప్‌లోని జార్జియాలో జరిగే 'వరల్డ్‌ రైజింగ్‌ స్టార్స్‌-2019' అంతర్జాతీయ అందాల పోటీలకు ఎంపికైంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పోటీల్లో మూడో సీజన్‌కు మొదటిసారిగా భారతదేశం నుంచి.. అదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి ఎంపికై ఘనత సాధించింది. యామిని ఇప్పటికే పలు చిన్నారుల అందాల పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించింది. చిన్నవయస్సులోనే పలు ఫ్యాషన్‌ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో నిర్వహించిన లిటిల్‌ ప్రిన్సెన్స్‌-2018 కాంటెస్ట్‌లో టైటిల్‌ గెలుచుని ప్రపంచ పోటీలకు అర్హత సాధించింది.

ఈ నెల 8 నుంచి 13 వరకు యూరప్‌లో జార్జియాలో వరల్డ్‌ రైజింగ్‌ స్టార్స్‌-2019 పోటీలు జరగనున్నాయి. ఆరువిభాగాల్లో యామిని పోటీ పడనుంది. ఐదేళ్ల చిరుప్రాయంలోనే యామిని అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది.

Next Story
Share it