Top
Sneha TV

వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' ట్రైలర్ వచ్చేసింది

X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా 'యాత్ర'. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టీ వైఎస్ఆర్ గా నటిస్తోన్న ఈసినిమాను మహీ వీ రాఘవ డైరెక్ట్ చేస్తున్నారు. ఇవాళ ఈ మూవీ ట్రైలర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. 'నా విధేయతని, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ..జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది..వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది'.. అనే డైలాగ్స్ ట్రైలర్ లో పొందుపరిచారు. పాదయాత్రకు దారితీసిన పరిస్థితులు, కాంగ్రెస్ హైకమాండ్ తో ఎదురైన ఇబ్బందుల్ని ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపిస్తారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it