Top
Sneha TV

కన్నా, సోము పవర్ బ్రోకర్స్ : ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

X

అమరావతి : ఏపి బిజెపి నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజులను టిడిపి ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ పవర్ బ్రోకర్స్ గా అభివర్ణించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ బీజేపీను ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు. ఈరోజు బీజేపీ నేతలు కొందరు సీఎం చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటనపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్ సీఎం చంద్రబాబు కను సైగచేస్తే బిజెపి నాయకులు ఇళ్లలోంచి బయటకు కూడా రాలేరన్నారు. పాముకు పాలు పోసి పోషించిన విధంగా బీజేపీ నేతలకు పదవులిచ్చి తప్పు చేశామని అభిప్రాయపడ్డ ఆయన కేసీఆర్, జగన్‌లు మోడీకి తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. మోడీ వార్డ్ మెంబెర్ కంటే హీనంగా మారారన్న ఆయన అన్నింటికీ యూసీలు ఇచ్చినట్లు నీతి ఆయోగ్ చెప్తున్నా ఇవ్వలేదని వాదిస్తున్నారన్నారు.

Next Story
Share it