Top
Sneha TV

సిక్కు వ్యక్తిని కాల్చి చంపిన తీవ్రవాదులు

X

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో ఓ సిక్కు వ్యక్తిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఖాసిపురలోని ట్రాల్ ప్రాంతంలో సిమ్రంజన్ సింగ్ పై కాల్పులు జరుపగా..తీవ్రగాయాలతో ఉన్న అతన్ని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సింగ్ ప్రాణాలు విడిచాడు. సిమ్రంజన్ సింగ్ సోదరుడు ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికయ్యాడని, సింగ్ పై కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని భద్రతాదళ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Next Story
Share it