Top
Sneha TV

జైల్లో పుస్తకం రాసిన జగన్‌పై దాడి కేసు నిందితుడు

X

విశాఖ: వైకాపా అధినేత జగన్ ఫై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు జైలులో ఒక పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకం విడుదలకు శ్రీనివాసరావు తరఫు నాయ్యవాది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై న్యాయమూర్తికి, జైళ్ల శాఖ డీజీకి లేఖలు అందజేసినట్లు న్యాయవాది సలీం చెబుతున్నారు. శ్రీనివాసరావు ఇప్పటికీ జగన్ అభిమానిగా ఉన్నారని.. క్రిస్మస్, న్యూ ఇయర్‌కు జగన్, ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పాలని కుతూహల పడినట్టు వెల్లడించారు. సరైన ఆధారం లేని కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఇబ్బందులు పెడుతున్నారని సలీం ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావును.. జగన్‌ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లి మాట్లాడించి ఈ కేసును ముగించాలని చూస్తున్నట్టు ఆయన తెలిపారు.

Next Story
Share it