Top
Sneha TV

అదుపుతప్పి పాసింజర్‌ ఆటోపై పడిన లారీ

X

పశ్చిమ గోదావరి : లారీ అదుపుతప్పి పాసింజర్‌ ఆటోపై పడిన ఘటన శుక్రవారం పోలవరం ప్రాజెక్టు సమీపంలో చోటు చేసుకుంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలో కాంక్రీట్‌ మిక్సర్‌ను తరలించే లారీ అదుపుతప్పి, పక్కనే వెళ్తున్న పాసింజర్‌ ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆటో నుజ్జునుజ్జయింది. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు గాయాలపాలైనవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it